'విద్యార్థులకు శాస్త్రీయ ఆలోచనలతోనే ఉజ్వల భవిష్యత్తు'

'విద్యార్థులకు శాస్త్రీయ ఆలోచనలతోనే ఉజ్వల భవిష్యత్తు'

RR: మియాపూర్ ప్రగతి ఎంక్లేవ్‌లోని ఒక స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు రూపొందించిన సైన్స్ ఎగ్జిబిషన్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన అట్టేపల్లి రామప్రభు విద్యార్థుల ప్రయోగాలు, వారి సృజనాత్మకతను చూసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్రదర్శనను వీక్షించిన విద్యార్థుల తల్లిదండ్రులు, కాలనీ వాసులు విద్యార్థులను కొనియాడారు.