'ప్రభుత్వ ఆర్థికసాయం పేదల ప్రాణాలు నిలబెడుతోంది'

PLD: అత్యవసర వైద్య చికిత్సల నిమిత్తం ప్రభుత్వం అందించే ఆర్థికసాయం పేదల ప్రాణాలు నిలుపుతోందని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో బుధవారం పలువురు పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన CMRF చెక్కులు పంపిణీ చేశారు. 25 మంది లబ్ధిదారులకు రూ. 34.92లక్షల విలువైన చెక్కులను అందజేశారు.