రామాలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

రామాలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

కృష్ణా: ఘంటసాల మండలం పూషడంలో కోదండ రామాలయ పునర్నిర్మాణం చేపట్టారు. శనివారం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విచ్చేసి పూజలు చేశారు. తుమ్మల నందీశ్వరరావు - సత్యవాణి దంపతులు, భీమా వెంకటేశ్వరరావు - సత్యవాణి దంపతులు శంకుస్థాపన పూజలు చేశారు. వేద పండితులు అతిథులను వేద ఆశీర్వచనం అందించగా, కమిటీ పెద్దలు సత్కరించారు.