నేడు అమలాపురంలో జాబ్ మేళా

నేడు అమలాపురంలో జాబ్ మేళా

కోనసీమ: అమలాపురంలో మంగళవారం ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మండపేట మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు తెలిపారు. ఈ మేళాలో 14 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొనున్నారు. 10వ తరగతి నుంచి ఆపైన చదివిన విద్యార్థులు దీనికి అర్హులన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు సర్టిఫకేట్లతో జిల్లా కలెక్టరేట్‌లో హాజరు కావాలన్నారు.