దత్తాత్రేయను ఆహ్వానించిన అవనిగడ్డ ఎమ్మెల్యే
కృష్ణా: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కలిశారు. బుధవారం హైదరాబాదులోని వారి స్వగృహంలో కలిసి ఈ నెల 19వ తేదీ అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో జరిగే 48వ దివిసీమ ఉప్పెన స్మారక సభకు ఆహ్వానించారు. ఉప్పెన ప్రభావిత గ్రామాలకు ఆనాడు దత్తాత్రేయ చేసిన సహాయం అపూర్వమన్నారు. ఈ సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా సత్కరించారు.