వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఈవో

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఓ దాత సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్యూరిఫైడ్ ప్లాంట్‌ను బుధవారం ఈవో శ్రీకాంత్ రావు ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం రూ. 3,60,000 వ్యయంతో నిజామాబాద్ జిల్లా వేల్పుర్ కు చెందిన అయినారి భాగీర్త, గోపాల్ దంపతులు వాటర్ ప్లాంట్‌ను నిర్మించి దేవాలయనికి విరాళంగా ఇచ్చారు.