పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురికి రిమాండ్

ASF: పేకాట ఆడుతున్న ఆరుగురుని జైలుకు పంపించిన ఘటన జైనూర్ మండలంలో చోటు చేసుకుంది. జైనూర్ శివారులో సోమవారం పేకాట ఆడుతుండగా జైనూర్ ఎస్సై రవి పోలీస్ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వీరి వద్ద రూ.12,450 నగదు, పేకాట ముక్కలు స్వాధీనం చేసుకొని ఆరుగురిపై కేసు నమోదు చేశారు. వారిని రిమాండుకు తరలించినట్లు ఎస్సై రవి తెలిపారు.