నేడు న్యాయ సేవలు పథకంపై న్యాయవిజ్ఞాన సదస్సు

SKLM: టెక్కలి పట్టణంలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో అలాగే శ్రీ లక్ష్మీ జీడిపప్పు పరిశ్రమలో అసంఘటిత రంగంలోని కార్మికులకు న్యాయసేవల పథకం 2015 అనే అంశంపై శనివారం ఉదయం 10 గంటలకు న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించనున్నట్లు టెక్కలి మండల న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు , సీనియర్ సివిల్ జడ్జి బి. నిర్మల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.