VIDEO: 'ప్రత్తిపాడులో రహదారులు చాలా దారుణ స్థితిలో ఉన్నాయి'

VIDEO: 'ప్రత్తిపాడులో రహదారులు చాలా దారుణ స్థితిలో ఉన్నాయి'

KKD: ప్రత్తిపాడు మండలంలో ఇటీవల చేపడుతున్న రహదారి నిర్మాణ పనులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో కొత్తగా వేసిన రోడ్లు తక్కువ కాలంలోనే దెబ్బతింటున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన గ్రామాల్లో నిర్మిస్తున్న రహదారులు చాలా దారుణ స్థితిలో ఉన్నాయని గిరిజనులు నిరసన తెలుపుతున్నారు.