నూతన ఎస్సైగా ఉదయ్ కిరణ్ బాధ్యతల స్వీకరణ

నూతన ఎస్సైగా ఉదయ్ కిరణ్ బాధ్యతల స్వీకరణ

MNCL: జన్నారం మండల నూతన ఎస్సైగా ఉదయ్ కిరణ్ బాధ్యతలు స్వీకరించారు. శనివారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో ఆయన నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయనను అభినందించారు. అనంతరం నూతన ఎస్సై ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. జన్నారం మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు.