వినూత్నంగా నిరసన చేపట్టిన..SFI నాయకులు
MHBD: రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్ల పైచిలుకు పెండింగ్ స్కాలర్‌షిప్, రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని SFI జిల్లా కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. ఇవాళ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల ముందు గేదెకు వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రేపు ఎమ్మెల్యే కార్యాలయ ముట్టడిని విజయవంతం చేయాలని కోరారు.