భాణుడి భగ భగ.. వాతావరణ శాఖ హెచ్చరిక
AP: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఇవాళ 32 మండలాల్లో తీవ్ర వడగాలులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలు సహా రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది.