చింతపల్లిలో నేడు జాబ్ మేళా
ASR: నేడు చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవాళ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. విజయ భారతి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఆధ్వర్యంలో ఈ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లోమా, డిగ్రీ చదివి ఖాళీగా ఉంటున్న 18 ఏళ్లు పైబడిన నిరుద్యోగ యువత ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.