'సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

BHPL: చిట్యాల మండలం శాంతినగర్ అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం ఉదయం డాక్టర్ రాకేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య సిబ్బంది ప్రజలకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. డా. రాకేష్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.