'ఈనెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి'
NLG: కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసనగా 10 జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 12న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని CITU తిప్పర్తి మండల కన్వీనర్ గణేష్ పిలుపునిచ్చారు. నేడు జీపీ కార్మికులతో కలిసి MPDOకు వినతి పత్రం అందజేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రం హరిస్తుందన్నారు.