మినీ మహానాడు కోసం స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే

మన్యం: గుమ్మలక్ష్మీపురంలో జరగనున్న నియోజకవర్గస్థాయి మినీ మహానాడు కార్యక్రమం నిర్వహణ కోసం స్థలాన్ని ప్రభుత్వ విప్ & కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మంగళవారం జరగబోయే మహానాడు విజయవంతం చేయాలన్నారు. ఇందులో మండల పార్టీ అధ్యక్షులు పాడి సుదర్శన్ రావు ఉన్నారు.