'ప్రభుత్వ పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం'
వికారాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు స్వపరిపాలన దినోత్సవం నిర్వహించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులే అధ్యాపకులుగా, HMగా బాధ్యతలు చేపట్టారు. పదవ తరగతి విద్యార్థినులు టీచర్లుగా మారి జూనియర్ విద్యార్థులకు పాఠాలు చెప్పారు. పాఠశాల నిర్వహణ నుంచి బోధన వరకు అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.