VIDEO: గంజాయి మత్తులో యువకులు రచ్చ రచ్చ..!
WGL: పట్టణ కేంద్రంలోని మిల్స్ కాలనీ పరిధిలో గంజాయి మత్తులో యువకులు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో దాడులకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. 2 రోజుల క్రితం సాకరాశి కుంట వద్ద ఓ వ్యక్తిపై బీరు సీసాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. రాత్రి వేళల్లో పోలీసులు నిఘా పెంచాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.