'డీజే టిల్లు' నటుడి ఇంట్లో తీవ్ర విషాదం

'డీజే టిల్లు' నటుడి ఇంట్లో తీవ్ర విషాదం

'డీజే టిల్లు' సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీధర్ గౌడ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య శశికళ కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె.. చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. దీంతో మురళీధర్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. 2022లో వచ్చిన 'డీజే టిల్లు' ఈయనకు మంచి గుర్తింపు తెచ్చింది. తర్వాత బలగం, మేం ఫేమస్, మ్యాడ్, టిల్లు స్కేర్ తదితర చిత్రాలు చేశారు.