'ఎక్కువ సీట్లు కేటాయించి న్యాయం చేయాలి'

'ఎక్కువ సీట్లు కేటాయించి న్యాయం చేయాలి'

MNCL: స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని పార్టీలు మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు పోతు విజయ శంకర్ కోరారు. ఆదివారం ఉదయం జన్నారంలో మాట్లాడుతూ.. రాజ్యాంగపరంగా మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తామని అన్ని పార్టీలు గతంలో ప్రకటించాయన్నారు. మహిళలకు కుటుంబ బాధ్యతలతో పాటు సామాజిక బాధ్యతలు బాగా తెలుసని ఆమె వివరించారు.