కలుషితమవుతున్న విశాఖ తీరం
విశాఖ సముద్రతీరం అందానికి పెట్టింది పేరు. అయితే, ఇది ప్రస్తుతం ప్రమాదంలో ఉందని చెప్పుకోవచ్చు. విశాఖ సముద్రం కాలుష్యంతో కలుషితమవుతోంది. నగరంలో ఉన్న మొత్తం 41 డ్రైన్లు ఉండగా అందులో కేవలం 18 మాత్రమే శుద్ధిచేయబడుతున్నాయి. మిగతావన్ని నేరుగా సముద్రంలో కలుపుతున్నారు. నగరంలో ఉత్పత్తి అవుతున్న మురుగునీరు నేరుగా వెళ్లి సముద్రంలో కలుస్తుంది. దీంతో సముద్రమంతా కలుషితమవుతోంది.