VIDEO: నారావారిపల్లెను ముట్టడిస్తాం: AITUC

TPT:ఆటో కార్మికుల జీవన విధానాన్ని ఈ కూటమి ప్రభుత్వం అడ్డుకుంటూ, వారి పొట్టగొడుతోందని ఏఐటీయూసీ నాయకులు మండిపడ్డారు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద నిరసనకు దిగారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో 11,252 మంది ఆటో కార్మికులు ఉన్నారని చెప్పారు. ఉచిత బస్సు పేరుతో ఆటో కార్మికులకు ఈ ప్రభుత్వం తీవ్రమైన ద్రోహం చేసిందన్నారు.