'ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి'
NLG: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం పెద్ద ఊర మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. 17 శాతం తేమతో, తాలు, తరుగు లేకుండా నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, జాప్యం చేయవద్దని, మంచు కురుస్తున్నందున ధాన్యంపై పట్టాలు కప్పి ఉంచాలని ఆమె అధికారులను ఆదేశించారు.