రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత మృతి

రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత మృతి

MHBD: మరిపెడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సీతారాంపురం కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకుడు గంగయ్య మృతి చెందారు. బుధవారం రాత్రి గిరిపురం నుంచి తిరిగి వస్తుండగా దేశ్య తండా సమీపంలో ఎదురుగా వచ్చిన కారు ఆయన వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గంగయ్య అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.