అనుబంధాన్ని చాటుకున్న సోదరీమణులు

అనుబంధాన్ని చాటుకున్న సోదరీమణులు

KKD: రాఖీ పండుగను కాకినాడ ప్రజలు శనివారం ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఇంట్లో సోదరీమణులు సోదరులకు రాఖీలు కట్టి, తమ అనుబంధాన్ని చాటుకున్నారు. యువతీయువకులు, మహిళల సందడితో ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. పలు దేవాలయాలలో అన్నాచెల్లెళ్లు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వీట్లు పంపిణీ చేశారు.