VIDEO: గిద్దలూరులో ఆహార భద్రతా అధికారి తనిఖీలు

VIDEO: గిద్దలూరులో ఆహార భద్రతా అధికారి తనిఖీలు

ప్రకాశం: గిద్దలూరులో శుక్రవారం ఆహార భద్రతా అధికారి శివతేజ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో ఆహారాన్ని పరిశీలించారు. ప్రతి ఒక్కరు కచ్చితంగా ఆహార నియమ నిబంధనలు పాటించాలన్నారు. ఎక్కడైనా లోపాలు ఉంటే ప్రజలు వెంటనే అధికారులను సంప్రదించాలన్నారు. ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని దుకాణ యజమానులకు సూచించారు.