పారిశుద్ధ్య పనులు పరిశీలించిన ఈవో
NTR: విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో పారిశుద్ధ్య పనులను ఈవో శీనా నాయక్ పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో ఎప్పటికప్పుడు పరిశుభ్రత కొనసాగాలని, భక్తులకు స్వచ్ఛమైన వాతావరణం కల్పించాలని సూచించారు. పారిశుద్ధ్య సిబ్బంది తమ కేటాయించిన ప్రాంతాల్లో క్రమంగా విధులు నిర్వహించాలని, అధికారులు పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.