'ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కలెక్టర్ కృషి అభినందనీయం'

'ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కలెక్టర్ కృషి అభినందనీయం'

ఆదిలాబాద్: జిల్లా అభివృద్ధికి కలెక్టర్ రాజర్షిషా చేస్తున్న కృషి అభినందనీయమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఇటీవల కలెక్టర్ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు పొందిన సందర్భంగా కలెక్టర్‌ను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేసినందుకు అవార్డు వరించిందని అన్నారు.