'కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి'

'కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి'

JN: మక్కల కొనుగోళ్లను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతోనే మక్కలను కొనుగోలు చేయాలని, అకాల వర్షాల వల్ల మక్కలు తడిసి దెబ్బ తినే అవకాశం ఉందన్నారు. వెంటనే కొనుగోళ్లను ప్రారంభించి ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలన్నారు.