'కొనుగోలు ఆలస్యం చేస్తే సహించేది లేదు'
NRML: ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించబోమని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ హెచ్చరించారు. లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలో నేడు కొనుగోలు కేంద్రం ప్రారంభించిన సందర్భంగా రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ట్రాన్స్‌పోర్ట్, సంచుల కొరత పేరుతో కొనుగోళ్లు ఆపడం సరికాదని అధికారులను ఫోన్‌లోనే నిలదీశారు.