ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన అధికారులు

NRPT: కొత్తపల్లి మండలం దుప్పటిగట్టులో సోమవారం అధికారులు ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఎంపీడీఓ కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు 45 నుంచి 65 గజాల స్థలంలోనే ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి క్రాంతికిరణ్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకట్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.