'సంపద కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి'
AKP: సంపద కేంద్రాల నిర్వహణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని DPO సందీప్ సూచించారు. మంగళవారం కసింకోట MPDO కార్యాలయంలో మండల స్థాయి, గ్రామస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంపద కేంద్రాలు సక్రమంగా నిర్వహిస్తే పంచాయతీలకు ఆదాయం వస్తుందన్నారు. వర్షాలు పడిన నేపాధ్యంలో పారిశుధ్యంపై దృష్టి సారించాలన్నారు.