నేడు గుడిపల్లిలో మెగా వైద్య శిబిరం
NLG: గుడిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఇవాళ మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. జనరల్ వైద్య నిపుణుల చేత హెల్త్ క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.