అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత
PDPL: మంథని మండలం విలోచవరం గోదావరి నది నుండి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకుని, ఫారెస్ట్ కార్యాలయానికి తరలించినట్లు ఫారెస్ట్ డీఆర్ రమేష్ తెలిపారు. మంథని మండలం సిద్ధపల్లికి చెందిన సది అనే వ్యక్తి ట్రాక్టర్ గా గుర్తించామన్నారు. అతనిపై అటవీ శాఖ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి డీఎఫ్ఎకు చర్యల నిమిత్తం పంపించడం జరుగుతుందని తెలిపారు.