కరెంటు వైర్లతో అప్రమత్తంగా ఉండాలి: వరంగల్ సీపీ

కరెంటు వైర్లతో అప్రమత్తంగా ఉండాలి: వరంగల్ సీపీ

WGL: వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం గణపతి శోభాయాత్ర సందర్భంగా జాగ్రత్తలు వహించాలని సూచించారు.      విగ్రహాల నిమజ్జనానికి తరలించేటప్పుడు రోడ్లపై వేలాడే కరెంటు వైర్ల పట్ల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వైర్లను తాకే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. అలాగే విద్యుత్ అధికారులతో కలిసి పోలీసులు ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.