VIDEO: అధ్వాన్నంగా మారిన RTO కార్యాలయం రహదారి

ASF: జిల్లా కేంద్రంలోని RTO కార్యాలయానికి వెళ్లే రహదారి అధ్వాన్నంగా మారింది. ఇటీవల కురిసిన వర్షానికి రహదారి గుంతల్లో నీరు నిలిచి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజలు వాపోయారు. ఒక్కరోజు వర్షానికే గుంతల్లో నీరు నిలిచిందని, రోజుల తరబడి వర్షాలు కురిస్తే రహదారి మొత్తం మునిగిపోతుందన్నారు. అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని కోరారు.