మాటేడు గ్రామంలో కాంగ్రెస్‌కు భారీ షాక్
MHBD: తొర్రూరు మండలం మాటేడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ గ్రామానికి చెందిన 100కు పైగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరారు. వారికి మాజీ మంత్రి దయాకర్ రావు కండువాలు కప్పి ఆహ్వానించారు. దయాకర్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.