జిల్లాలో ఇద్దురు యువకులు దారుణ హత్య
NDL: జిల్లాలో కత్తిపోట్లతో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. తల్లిని కొట్టాడన్న కోపంతో బావమరిది ఇంటికి వెళ్లిన యువకుడు, అతని స్నేహితుడు కత్తిపోట్లకు గురై మరణించారు. ఈ ఘటనలో కొమ్ము పెద్దన్న (25), చాకలి సురేష్ (25) మృతి చెందారు. నిందితుడు చుట్ల రాజ్‌కుమార్, అతని కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ జంట హత్యల నేపథ్యంలో హరిజనపేటలో ఉద్రిక్తత నెలకొంది.