ఉరి వేసుకుని మహిళా ఆత్మహత్య

ఉరి వేసుకుని మహిళా ఆత్మహత్య

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన మహిళ కొంపెల్లి లక్ష్మీ(42) అనారోగ్య సమస్యలు భరించలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన లక్ష్మీ అనారోగ్యంతో బాధపడుతోంది. ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నా ఆమెకు ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.