VIDEO:కల్వర్టు వద్ద ధాన్యం ట్రాక్టర్ బోల్తా
KKD: ప్రత్తిపాడు(M) పెదశంకర్లపూడి సమీపంలో గురువారం సాయంత్రం ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. రైస్ మిల్లుకు ధాన్యం తీసుకెళ్తుండగా తెల్ల క్వారీ దగ్గర కల్వర్టు వద్ద ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. ధాన్యం బస్తాలు సమీపంలోని నీటిలో పడిపోవడంతో తడిసిపోయాయి.