తల్లి మరణాన్ని దాచి.. పెన్షన్ డబ్బులు డ్రా..!
HYD: తల్లి మరణించిన విషయాన్ని దాచిపెట్టి పెన్షన్ కాజేసిన కువార్తెపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాలు.. మధురానగర్‌కు చెందిన రేణుక తల్లి మృతి చెందింది. అయితే ఆ విషయాన్ని దాచిపెట్టి సంవత్సరాలు తరబడి రూ. 6.45 లక్షల పింఛన్ డబ్బులను డ్రా చేసినట్లు TGSPDCL అధికారులు మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.