సిరివెళ్ల తహశీల్దార్‌ను కలిసిన ఎంపీపీ

నంద్యాల: సిరివెళ్ల మండల తహశీల్దార్ పుష్ప కుమారిని మంగళవారం మండల పరిషత్ అధ్యక్షుడు నాయక్ మహమ్మద్ వసీం మంగళవారం కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్‌ను కోరారు. ఈ విషయంపై ఆమె సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఈఓ ఆర్డీ నాగేంద్రుడు, ఆవుల చందు, తదితరులు పాల్గొన్నారు.