భైరవకోనలో భక్తుల సందడి

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన భైరవకోనలో ఆదివారం భక్తులు సందడి చేశారు. ఆదివారం కావడంతో చుట్టుపక్కల గ్రామాలనుండి భక్తులు భైరవకోనకు చేరుకొని సుందరమైన జలపాతంలో సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ప్రముఖ దుర్గామాదేవి, నాగభైరవేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అమ్మవారు తీర్థ ప్రసాదాలను అందజేశారు.