భారత జవాన్ల స్మృతికి ఎమ్మెల్యే ఘన నివాళులు
E.G: 1971లో జరిగిన భారత్, పాకిస్తాన్ యుద్ధంలో భారత్ సాధించిన విజయానికి ప్రతీకగా డిసెంబర్ 16వ తేదీన విజయ్ దివస్ జరుపుకుంటున్నట్లు కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా నాటి యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భారత జవాన్ల స్మృతికి మంగళవారం ఘన నివాళులు అర్పించారు. భారత సైనికుల త్యాగాలను గౌరవించడానికి ఈ రోజు అంకితం చేశారన్నారు.