గజపతినగరంలో మేడే వేడుకలు

VZM: గజపతినగరంలో మే డే వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహం వద్ద భవన నిర్మాణ సంఘం నేత నర్సింగరావు, ధన లస్సీ వద్ద పంచాయతీ యూనియన్ కార్మిక నేత బి. కనకరాజు, రిక్షా కార్మిక సంఘం నేత సూర్యనారాయణలు సీఐటీయూ పతాకాలను ఆవిష్కరించారు. రాష్ట్ర కోచ్ ఛైర్మన్ బి. కాంతారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.