VIDEO: దిన్నెపాడు గ్రామంలో విషాదం.!
అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నెపాడు గ్రామానికి చెందిన షేక్ హసీనా (38) అనే వివాహిత శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో మంటలు తీవ్రంగా వ్యాపించి, ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై శోభ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.