'జల ద్రోహులకు ఈ తీర్పుతో జ్ఞానోదయం కలిగి ఉండాలి'
HYD: ఇది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదు పీసీసీ నివేదిక అని గతంలో చెప్పామని, ఇవ్వాళ హైకోర్టు తీర్పుతో అక్షర సత్యం అని తేలిపోయిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. నీళ్లు నిండి పైనుండి పోయినా నిల్చున్న మేడిగడ్డ బ్యారేజ్‌ను పట్టుకొని నానా మాటలు అన్నారని, 60 ఏళ్లుగా తెలంగాణకు నీళ్లు ఇవ్వకుండా దోచుకున్న జల ద్రోహులకు ఈ తీర్పుతో జ్ఞానోదయం కలిగి ఉండాలన్నారు.