వచ్చేనెల 1న మండల సర్వసభ్య సమావేశం

కర్నూలు: మండల సర్వసభ్య సమావేశం వచ్చేనెల 1న నిర్వహిస్తున్నారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రఘునాథ్ వెల్లడించారు. ఈ సమావేశానికి ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, గ్రామాల సర్పంచులు, మండల స్థాయి అధికారులు హాజరవుతారని అన్నారు.