నిలోఫర్ సమస్యలంటే సర్కారుకు చులకనే
HYD: నిలోఫర్ ఆసుపత్రి వైద్యంపై నమ్మకం ఉన్నా, సమస్యలు రాజ్యమేలుతున్నాయి. రోజూ 1,200 నుంచి 1,500 ఓపీలు నమోదవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేషెంట్ల తల్లిదండ్రులు వాపోతున్నారు. మొరాయించే లిఫ్ట్‌లు, ఉపయోగంలోకి రాని వెయిటింగ్ హాల్‌తో పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా, ఆసుపత్రిలో బెడ్స్ సమస్య చిన్నారులను వేధిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.