అప్పుల బాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య

ATP: పెద్దవడుగూరు మండల కేంద్రంలో బాలిరెడ్డి అనే రైతు అప్పుల బాధ తాళలేక గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులు చేసి పంట సాగు చేశాడు. ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో నష్టపోయాడు. రుణదాతలు ఒత్తిడి రావడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.